Aryan Khan : క్రూయిజ్ షిప్ లో ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని, డ్రగ్స్ విక్రయించాడని.. ఎన్‌సీబీ దాదాపుగా 20 రోజులకు పైగానే ఆర్యన్ ఖాన్‌ను జైలులో ఉంచింది. అయితే మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ రంగ ప్రవేశం చేసి కేవలం 2 రోజుల్లోనే బెయిల్ వచ్చేలా చేశారు. దీంతో షారూఖ్ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. అయితే బెయిల్ లభించినప్పటికీ డ్రగ్స్ కేసు ఆర్యన్ ఖాన్‌ను ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు.
ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన సమీర్ వాంఖెడె అతన్ని విడిచిపెట్టేందుకు రూ.25 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ నడుస్తోంది. ఇక ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సరే సరి. బెయిల్ లభించినా ఎన్‌సీబీ అధికారులు పిలిచినప్పుడు వెళ్లాలి. లేదా వారు వచ్చినా విచారణకు సహకరించాలి.
ఇక ఎన్‌సీబీపై వస్తున్న ఆరోపణలకు, ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తుకు ఎన్‌సీబీ ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసులో అందరు నిందితులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్బాజ్ మర్చంట్‌ను అధికారులు విచారించారు. అయితే ఆదివారమే ఆర్యన్‌ను కూడా విచారణకు పిలిచినా.. అతను అనారోగ్య సమస్యల కారణంగా రాలేనని చెప్పాడు. దీంతో సోమవారం అతను సిట్ విచారణకు హాజరవుతాడని తెలుస్తోంది.
ఏది ఏమైనా.. ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు వచ్చినా.. అతను కొద్ది రోజులు కూడా సంతోషంగా లేడు. కేసులు అని, విచారణ అని.. మళ్లీ తిరగాల్సి వస్తోంది. ఓ వైపు అతన్ని బాలీవుడ్‌కు పరిచయం చేద్దామని షారూఖ్ కలలు కన్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. మరి ఈ కేసులో అతను నిర్దోషిగా బయటకు వస్తాడా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…