Ante Sundaraniki : నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం.. అంటే సుందరానికి. ఈ మూవీ జూన్ 10వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక గురువారం రాత్రి ఈ మూవీకి గాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అంటే సుందరానికి చిత్రానికి గాను డిజిటల్ హక్కులను గతంలో అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలిసింది. కానీ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీకి గాను డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నజ్రియా ఫహాద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. కనుక ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

అయితే ఈ మూవీని ఇప్పుడప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయబోమని.. కనుక సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.. అని నజ్రియా వెల్లడించింది. ఇక ఈమె ఇందులో నాని పక్కన హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ రన్‌టైమ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. కనుక సినిమా ఏ మేర ప్రభావం చూపిస్తుంది.. అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.