Ante Sundaraniki : నాని, నజ్రియా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ.. అంటే సుందరానికీ.. ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా వసూలు చేయలేదు. దీంతో నాని కెరీర్ లో ఇది కూడా మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది. నానిపై ఈ మధ్య కాలంలో తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆయన ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గతంలో చేసిన వ్యాఖ్యలే ఇంకా ఆయన సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పవచ్చు. మరో వైపు పెరిగిన టిక్కెట్ల ధరలు కూడా ఒక కారణమే. చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. ఫలితంగా ప్రస్తుతం విడుదల అవుతున్న అనేక సినిమాలు దారుణమైన ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంటున్నాయి.
అంటే సుందరానికీ.. మూవీ జూన్ 10వ తేదీన రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు గాను డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. జూలై 10వ తేదీన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించారు. బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ మూవీకి దర్శకుడు.

ఈ మూవీ బడ్జెట్ రూ.30 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.38 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీలో నదియా, హర్షవర్ధన్, రోహిణి, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు.