Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యారు. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు. తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను అన్న అక్కినేని వెంకట్ తో కలిసి చూసుకుంటున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ కి ఒక బ్రాండ్ ఉంది. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలన్ని ఫ్యామిలీస్ ని బాగా ఆకట్టుకుంటాయని ఒక పేరుంది.
శివ సినిమాతో రాం గోపాల్ వర్మలాంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసి తండ్రిలాగే కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయడం లాంటివి ఎన్నో చేశారు నాగార్జున. నాగేశ్వర రావు, నాగార్జుల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ప్రతి విషయంలోనూ తండ్రి మాట జవదాటడు నాగార్జున. అలాంటిది తన పెళ్ళి విషయంలో మాత్రం తండ్రికి ఎదురు నిలబడ్డాడు. నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. అయితే నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే శ్రీలక్ష్మితో వివాహమైంది. అప్పటికే ఈ దంపతులకు నాగచైతన్య జన్మించాడు. ఆ తర్వాత ఆమెతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున తనతో పాటు శివ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను పెళ్లి చేసుకున్నారు.
అయితే అమలను వివాహం చేసుకోవడం ఏఎన్ఆర్ కు ఇష్టం లేదట. సినిమా రంగంలో ఉన్న వారి వ్యక్తిగత జీవితాలు సక్రమంగా ముందుకు సాగవని ఆయన నమ్మేవారు. పెళ్లయి విడాకులు తీసుకున్న నాగార్జున.. సినిమా రంగంలో ఉన్న అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న ఆందోళనతో ఉన్నారట. అందుకే ఏఎన్ఆర్ అమలను తన ఇంటి కోడలుగా స్వీకరించేందుకు ఇష్టపడలేదట. దీనికి తోడు అమల తెలుగు అమ్మాయి కాదు. దీంతో నాగార్జునను ఎలా అర్థం చేసుకుంటుందో అన్న అనుమానం కూడా ఏఎన్ఆర్ కు ఉండేదట. అయితే చివరకు నాగార్జున ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. ఆ తర్వాత అమల అక్కినేని ఫ్యామిలీ విలువలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆ ఇంటి కోడలిగా ఒదిగిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…