Mega Family : మెగా డాటర్ శ్రీజను వివాహం చేసుకొని మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు కళ్యాణ్ దేవ్. అలాగే విజేత సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ మెగా కాంపౌండ్ కి చెందిన వాడా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చాయా ? వారు విడిపోయారా ? లేదంటే విడాకులు తీసుకోబోతున్నారా ? సోషల్ మీడియాలో వీరిద్దరిపై జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నప్పటికీ ఇరు కుటుంబాలు ఈ విషయంపై స్పందించడం లేదు.
కానీ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల సోషల్ మీడియా ఖాతాలను చూస్తే విడివిడిగా ఉంటున్నారని అర్థమవుతుంది. అంతేకాకుండా మెగా ఇంట్లో జరుగుతున్న ఈవెంట్లకు, సెలబ్రేషన్స్ కు కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు. ఇదిలా ఉండగా శ్రీజ అయితే మూడో పెళ్లికి కూడా సిద్ధపడిందనే వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ కూడా రెండో వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. కళ్యాణ్ దేవ్ రిలేషన్స్ లో తనకు మరదలు వరస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట.

ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా సోషల్ మీడియాకు లీక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు శ్రీజ తన విడాకుల విషయంపై అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉందట. శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటున్న కారణంగా ఆమె తలపొగరు దించడానికి కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో సెలబ్రెటీస్ పెళ్లిళ్లు, విడాకులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. శ్రీజ మూడో పెళ్లి, కళ్యాణ్ రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.