Annapurna : సీనియర్ నటీమణులలో అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని వందల చిత్రాలలో తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం యువ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అన్నపూర్ణ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. తాను సినిమాలలో కనిపించే అంత మెతక కాదని పని చేస్తే డబ్బులు వస్తాయని.. అలా పని చేసిన వెంటనే తన డబ్బులు అడిగే దానిని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఇండస్ట్రీలో అందరినీ వరుసలతో పెట్టి పిలిచే అన్నపూర్ణ చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
షూటింగ్‌లో తనకు లైట్ చూసుకోవడం రాదని ఆమె తెలిపారు. అలా ఓ సందర్భంలో చిరంజీవి లైట్ చూసుకోవడం రాదా.. అంటూ అందరి ముందు గట్టిగా అరిచి.. లైట్ చూసుకో.. అని చెప్పారని ఆమె చిరంజీవి గురించి తెలిపారు. అయినా ఆయన నా మంచి కోసమే చెప్పారని.. ఆ ఇంటర్వ్యూలో అన్నపూర్ణ పేర్కొన్నారు.