సీఎం జగన్ ప్రభుత్వ అరాచకాలను యువత నిలదీయాలని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, చింతకాయల విజయ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం యువతను, విద్యార్థులను పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్‌ను యువత నిలదీయాలని లేదంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాలేజీలు తిరుగుతూ యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని అన్నారు. 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించలేదన్నారు. కనుక యువత మేల్కొనాలని, తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…