ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఏపీలో కొత్త కోవిడ్ వేరియెంట్‌.. 3-4 రోజుల్లోనే సీరియ‌స్ కండిష‌న్‌కు..

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఏపీకి చెందిన వైద్యులు షాకింగ్ విష‌యం చెప్పారు. ఏపీలో ఎన్‌400కె అనే కొత్త వేరియెంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బ‌యాల‌జీ (సీసీఎంబీ) తెలిపింది. విశాఖ‌ప‌ట్నంతోపాటు ఆ రాష్ట్రంలోని ప‌లు ఇత‌ర ప్రాంతాల్లోనూ ఈ వేరియెంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్న‌ట్లు తెలియ‌జేసింది. అందువ‌ల్లే ఏపీలో కోవిడ్ కేసులు ఎక్కువ‌గా పెరుగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు.

కాగా ఈ కోవిడ్ స్ట్రెయిన్ ముందుగా క‌ర్నూల్‌లో గుర్తించ‌బ‌డింద‌ని, పాత వేరియెంట్ల క‌న్నా కొత్త స్ట్రెయిన్ 15 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని వైద్య నిపుణులు తెలిపారు. ఇండియ‌న్ వేరియెంట్ల‌యిన బి1.617, బి1.618ల క‌న్నా ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా విశాఖ‌ప‌ట్నం జిల్లా క‌లెక్ట‌ర్ వి.విన‌య్ చంద్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వ్యాప్తి చెందుతున్న వైర‌స్‌కు చెందిన శాంపిల్స్‌ను సేక‌రించాం, సీసీఎంబీకు పరిశీల‌న నిమిత్తం పంపించాం. అయితే కోవిడ్ మొద‌టి వేవ్ క‌న్నా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియెంట్ భిన్నంగా ఉంద‌ని తెలిసింది.. అన్నారు.

జిల్లా కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ పీవీ సుధాక‌ర్ మాట్లాడుతూ.. కొత్త కోవిడ్ వేరియెంట్ ఇంకుబేష‌న్ స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అన్నారు. గ‌తంలో కోవిడ్ బారిన ప‌డిన‌ప్పుడు శ్వాస అంద‌ని స్థితి వ‌చ్చేందుకు క‌నీసం వారం రోజుల స‌మ‌యం ప‌ట్టేద‌ని, కానీ ఇప్పుడు కొత్త వేరియెంట్ వ‌ల్ల ఆ స్థితి కేవ‌లం 3-4 రోజుల్లోనే వ‌స్తుంద‌న్నారు. అందువ‌ల్ల బెడ్లు, ఆక్సిజ‌న్‌కు కొర‌త ఏర్ప‌డింద‌న్నారు.

ఇక కొత్త కోవిడ్ వేరియెంట్‌కు త‌క్కువ స‌మ‌యం పాటు ఎక్స్‌పోజ్ అయిన‌ప్ప‌టికీ ఏకంగా 4-5 మందికి వైర‌స్ సోకుతుంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త వేరియెంట్‌ను అస‌లు అంచ‌నా వేయ‌లేక‌పోతున్నామ‌ని అన్నారు. దీనిపై మ‌రిన్ని పరిశోధన‌లు చేయాల్సి ఉంటుంద‌న్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM