కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వందలకొద్దీ లారీలు వరదలో చిక్కుకుపోయాయి. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అయితే అప్పటికే ఇసుక కోసం వందలాది లారీలు అక్కడ ఉండడంతో లారీలు మొత్తం వరద ఉధృతిలో చిక్కుకుపోయాయి.
ఈ వరద ఉధృతికి సుమారు 132 లారీలు కొట్టుకుపోవడంతో లారీ డ్రైవర్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫలంగా వరద ఉధృతి పెరగడంతో లారీలు వెనుదిరిగ లేక వరద ప్రవాహంలో చిక్కుకుపోయాయి. ఈ విధంగా లారీలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు,రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈక్రమంలోనే వరదల్లో చిక్కుకున్న ప్రొక్లెయిన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కూలీలను, క్లీనర్ లను అగ్నిమాపక సిబ్బంది పడవల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అలాగే వరదలో కొట్టుకుపోయిన లారీల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గితే తప్ప వరదల్లో చిక్కుకున్నటువంటి లారీలను బయటకు తీసుకు తీయలేమని అధికారులు తెలియజేయడంతో లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…