Cyclone Gulab : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తీరాన్ని తాకిన గులాబ్ ఉఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో గులాబ్ తుఫాన్ తీరాన్ని తాకింది. దీంతో 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అయితే రానున్న 4-5 గంటల్లో గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అలర్ట్ చేసింది.
గులాబ్ తుఫాన్ కారణంగా రానున్న 4-5 గంటల్లో హైదరాబాద్‌లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్ నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.