ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం జాగ్రత్తలు పాటించడం, వాక్సిన్ తీసుకోవడమే మన ముందున్న అస్త్రాలు.ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.తాజాగా భారతదేశంలో రెండవ దశ తీవ్రత అధికంగా ఉండడంతో రోజురోజుకు కేసులు అధికం అవుతూ ఎంతోమంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆక్సిజన్ లభించగా ప్రాణాలు వదులుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుల ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడుకోగలమని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి వారి వారి వాదనలను వినిపించారు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య తయారు చేస్తున్న మందు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని ఆనందయ్య ఆయుర్వేద మందు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మందు కాదని, అది అతను తయారు చేసే చట్నీ అని ఇది తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయట పడకుండా చస్తారంటూ బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కరోనా 14 రోజులలో తగ్గిపోతుంది. అలాంటిది పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కృష్ణ పట్నం వెళ్లి మందు తీసుకుంటేనే నయమవుతుందనడం సమంజసం కాదు.ఇప్పటికైనా కృష్ణ పట్నం వెళ్లి మందులు తీసుకున్న వారు అందరూ కూడా మరోసారి పరీక్షలు చేయించుకోవాలని, ఇప్పటికే మనం ఎంతో ప్రమాదపు అంచుల్లో ఉన్నాము, ఇలాంటి సమయంలో ఈ మందులు వాడితే మన ప్రాణానికి కాకుండా ఇతరులకు కూడా ఎత్తు ప్రమాదం కల్పించిన వారవుతారని బాబు గోగినేని తెలిపారు.ఈ విధంగా కృష్ణపట్నం ఆనందయ్య నందు పై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…