Andhra Pradesh Assembly : ఏపీ అసెంబ్లీలో శుక్రవారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో చంద్రబాబు సభ నుంచి బయటకు వచ్చి నేరుగా టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తనను, తన భార్యను అవమానించారని, దారుణంగా వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అయితే ఆ రోజు ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ? ఎవరు ఏమన్నారు ? అన్న వివరాలు తెలియలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో లోకేష్‌తోపాటు చంద్రబాబు కుటుంబాన్ని కొందరు అన్నమాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. మరి ఈ వీడియోను క్రియేట్ చేశారా.. లేదా నిజంగా.. జరిగిందా.. అన్న వివరాలు తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
బహుశా చంద్రబాబు అందుకే భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అనేక మంది వైసీపీ నాయకుల తీరును తప్పు బడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం టీడీపీనే విమర్శిస్తున్నారు. పట్టాభి జగన్‌ను అన్ని మాటలు అన్నప్పుడు ఏం చేశారు ? అని టీడీపీని కొందరు ప్రశ్నిస్తున్నారు.