Anchor Suma : కొన్ని దశాబ్ధాల నుండి బుల్లితెరపై రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ సుమ. టీవీ షోస్, ఆడియో ఫంక్షన్స్, సినిమాలు ఏదైన తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటుంది సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయిన సందర్భాలు అనేకం. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంది. అయితే సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత యాంకరింగ్ లోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. అయితే తాజాగా సుమ చేసిన ఓ పనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను పుట్టింది పాలక్కాడ్ లో.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. జీవితం అంటేనే పెద్ద ఛాలెంజ్, పోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది అని అన్నారు సుమ. అలాగే ”ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీం.. ఎందుకంటే నన్ను ఆదరించి ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం ఏదోకటి చేయాలి అని అనుకున్నా.. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది అని తెలిపింది సుమ.

ఇక నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు” అంటూ సుమ చెప్పుకొచ్చారు దాంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సుమ మాట్లాడుతూ.. ఏం చేయాలి అనుకుంటున్నామో అది కరెక్ట్ గా చేసినప్పుడే మనకు పేరు వస్తుంది. నా ఏజ్ కి నాకు క్లారిటీ లేనే లేకుండా ఉంది… నేను ఇంటర్లో బైపీసీ చేశా డిగ్రీలో బీకామ్ చేసి తర్వాత ఎంకామ్ చేశా. ముందు అకౌంట్స్ సెక్షన్ లోకి వెళ్దామనుకున్నా తర్వాత టీచర్ అవుదామనుకున్న తర్వాత ఏదో చేస్తూ చివరికి యాంకర్ అయ్యానంటూ సుమ షాకింగ్ కామెంట్స్ చేసింది.