Anchor Sreemukhi : బుల్లితెరపై తమ మాటల ప్రవాహంతో అలరిస్తున్న టాప్ యాంకర్లు ఎవరంటే.. వారిలో శ్రీముఖి పేరు తప్పక వినిపిస్తుంది. ఈమె ఏదైనా షోలో పాల్గొంది అంటే చాలు.. ఎంతో సందడిగా ఉంటుంది. వసపిట్టలా ఎప్పుడూ ఏదో ఒకటి గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. అయితే శ్రీముఖి ఈ మధ్య అందాల జాతరకు తెర లేపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షో చేస్తూ అలరిస్తోంది. అయితే శ్రీముఖిలో ఇంత సడెన్‌గా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది.. ఆమె ఇంతలా ఎందుకు గ్లామర్ షో చేస్తుంది.. అని నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందుకు కారణం కూడా ఉందని తెలుస్తోంది.
ఈమధ్యే ఆహా ప్లాట్‌ఫామ్‌లో ఓ డ్యాన్స్ షో ప్రారంభం అయింది. దీనికి యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. అయితే ఈ షోకు తగినంత పబ్లిసిటీ తేవడం కోసమే శ్రీముఖి ఇలా గ్లామర్ షో చేస్తుందని అర్థమవుతోంది. సాధారణంగా టీవీల్లో వచ్చే షోలకే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఓటీటీల్లో షోలంటే స్టార్ హీరోలు, హీరోయిన్లు చేస్తేనే ఎవరూ చూడడం లేదు. అలాంటిది యాంకర్ అయితే ఎవరు చూస్తారు.. కనుక ఆ డ్యాన్స్ షోకు పబ్లిసిటీ తేవడం కోసమే శ్రీముఖి ఇలా అందాలను ఆరబోస్తుందని అంటున్నారు.

ఇక శ్రీముఖి ఓ వైపు బుల్లితెరపై బిజీగా ఉంటూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తోంది. ఇప్పటికే ఈమె ఈమధ్య కాలంలో పలు సినిమాల్లో నటించింది. అయితే అవి అంతగా హిట్ అవలేదు. అయినప్పటికీ సినిమాల్లో అవకాశాల కోసం ఈమె ట్రై చేస్తూనే ఉంది. ఇక శ్రీముఖి చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ మూవీలోనూ నటిస్తోంది. మరోవైపు పలు టీవీల్లో షోస్ కూడా చేస్తోంది.