Anasuya : బుల్లితెరపై ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే అనసూయ మరోవైపు వెండి తెరపై కూడా వరుస సినిమాలతో అలరిస్తోంది. ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాలో ఆమె దాక్షాయణి అనే పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇక ప్రస్తుతం ఆమె పుష్ప మూవీ రెండో పార్ట్‌లోనూ నటిస్తోంది. అలాగే రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటించింది.
అయితే ఖిలాడి సినిమాలో అనసూయ డ్యుయల్ రోల్ పోషించిందని.. అందులో ఒక పాత్ర చనిపోతుందని, ఒక పాత్ర సినిమా మొత్తం కనిపిస్తుందని.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. ఖిలాడి సినిమాలో అనసూయ కేవలం ఒకే పాత్రలో నటించిందని.. అది కూడా ఓ హీరోయిన్‌కు తల్లిగా.. అంటే.. రవితేజకు అత్తగా నటించిందని సమాచారం.
ఇక ఖిలాడి సినిమాలో అనసూయ పాత్ర పేరు చంద్రకళ అని తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక సమాచారం లేదు. అయితే ఏమైనా అప్‌డేట్స్ విడుదల చేస్తే అనసూయ పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ ఏపీలో అప్పటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీ, రాత్రి కర్ఫ్యూ నిబంధనలను సడలిస్తారా.. లేదా.. అన్నది చూడాలి.
ఖిలాడి మూవీకి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే భారీగా బిజినెస్ చేసినట్లు తెలిసింది. దీంతో నిర్మాత దర్శకుడికి ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…