Anasuya : అందాల యాంకర్ అనసూయ గురించి తెలుగువారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అందాల యాంకరమ్మ. పలు టీవీషోలలో యాంకర్ గా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమా రంగంలో కూడా అడుగు పెట్టింది. మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వెండితెర మీద కూడా రాణించింది. అనసూయకు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా బాగా కలిసొచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది.
రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా మంచి నటనను కనబరచటంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. పుష్ప చిత్రంలో కూడా దాక్షాయిని పాత్రలో ప్రేక్షకులను అనసూయ నటనతో మెప్పించింది. అనసూయ అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పాత్రలను కంగారు పడకుండా ఎంచుకుంటుంది. ఇక అనసూయ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంది. 2010 ఫిబ్రవరి 10న అనసూయ కాస్తా అనసూయ భరద్వాజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇటీవల అనసూయ తన 38వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి భర్త, కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళింది. ఈ సందర్భంగా తన భర్త శశాంక్ భరద్వాజ్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది అనసూయ. ప్రేమ, అన్యోన్యంగా ఉండటం గురించి, చిన్న చిన్న లోపాలను అర్ధం చేసుకోవటం గురించి 17 సంవత్సరాల క్రితం నాకు ప్రామిస్ చేసావు. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను. 8 సంవత్సరాల క్రితం ఇదే రోజు నా కోసం వీటి గురించి ప్రపంచానికి ప్రామిస్ చేసావు. హ్యాపీ 8 లవ్ అంటూ అనసూయ భర్త కోసం ట్వీట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…