Anasuya Family Background : అందంతోనే కాకుండా మాటలతో కూడా ఆకట్టుకునే అద్భుతమైన నైపుణ్యం ఆమె సొంతం. యాంకర్ గానే కాకుండా, నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ఇంకెవరో కాదు అందానికి, చలాకితనానికి మారుపేరు అయినా అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సినీ రంగంలో కూడా తళుక్కుమని మెరుస్తుంది. మాటలతో మ్యాజిక్ చేస్తూ అందరిని తనువైపు ఆకర్షిస్తుంది ఈ బబ్లీ బ్యూటీ. పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా తరగని సౌందర్యంతో కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది.
ఇక అనసూయ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. అనసూయ స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి. అంటే పక్కా తెలంగాణ అమ్మాయి అన్నమాట. తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. ఆయన తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట సుదర్శన్ రావు. కానీ అనసూయ మాత్రం బద్రుక కాలేజ్ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకొని, ఆ తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసింది. అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రయివేట్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో చేరింది.
ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడే సాక్షి టీవీలో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి వెంటనే అప్లై చేసిందట. అయినా మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్న టైంలో ఆశ్చర్యకరంగా అనసూయను ఎంపిక చేశారు సాక్షి టీవీ మేనేజ్ మెంట్. అయితే అనసూయకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్లు పాటు ఇంటికే పరిమితమైంది. అయినా తన అభిరుచిని చంపుకోలేక ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో నాగ వంటి కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదట్లో ఆమె అనుకున్న మేరకు సక్సెస్ సాధించలేకపోవడంతో సినిమా ప్రయత్నాలు పక్కన పెట్టి టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యాంకర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది.
మాటీవీలోని భలే ఛాన్స్ లే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చింది అనసూయ. కానీ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది అనసూయ. ఆమె అందచందాలు, వాక్చాతుర్యం జబర్దస్త్ షోకు ప్లస్ గా నిలిచాయి. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, గాయత్రి, యాత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా వచ్చిన పుష్ప చిత్రంలో దాక్షాయిని పాత్రలో ప్రేక్షకులను బాగా మెప్పించింది.
ఇక అనసూయ వివాహ జీవితానికి వస్తే.. ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడింది. ఎన్‌సీసీ క్యాంప్ లో సుశాంక్ భరద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసాడు. కానీ అప్పుడు అంగీకారం తెలుపని ఆమె ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఎన్‌సీసీ క్యాంప్‌లో భరద్వాజ్‌తో స్నేహం కాస్త ప్రేమగా మరి తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో అనసూయ 2010లో సుశాంక్ భరధ్వాజ్ ను వివాహం చేసుకుంది . వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ గా పని చేస్తారు. ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూనే, తనకు ఇంత లైఫ్ ఇచ్చిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకోనని చెబుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…