Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద అనసూయ స్పందిస్తుంటుంది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది. దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలర్ల మీద అనసూయ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇదొక సర్కిల్‌లా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా కూడా అనసూయ మాత్రం వెనక్కి తగ్గదు. అలా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది.
తాజాగా అనసూయ తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఇందులో ఎయిర్ పోర్ట్‌లో విమానాయాన సంస్థ చేసిన పనుల గురించి పేర్కొంది. బెంగుళూరు నుండి హైదరాబాద్ కి అనసూయ కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణమయ్యింది. దీనికోసం ఆమె ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంది. టికెట్ లో ఉన్న సమయం కంటే ముందే ఎయిర్ పోర్ట్ కి రావాలని ఎయిర్ లైన్ సంస్థ వారు సందేశం పంపారట. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపలేదట.
మాస్క్ లు ధరించి ఫ్లైట్ లోపలికి వెళ్లగా.. సీట్లు ఒకచోట కాకుండా వేరువేరుగా కేటాయించారట. వరుసగా సీట్లు బుక్ చేస్తే వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సమాధానం లేదట. పైగా అనసూయ కూర్చున్న సీటు సరిగా లేదట. చిరిగిపోయి ఉండటం వలన పదునైన వస్తువు తాకి ఆమె చొక్కా చిరిగి పోయిందట. ఎయిర్ పోర్ట్ తో పాటు ఫ్లైట్ లో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులు వివరిస్తూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. మరి అనసూయ సందేశానికి సదరు ఎయిర్ లైన్స్ సంస్థ సమాధానం ఇస్తారో లేదో చూడాలి..
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…