Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లోనూ తన సత్తా చాటుతున్న యాంకర్ అనసూయను ఎల్లప్పుడూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆమె ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె మరోమారు వివాదంలో చిక్కుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ గేయాన్ని ఆమె కూర్చుని పాడిందంటూ.. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ వివాదంపై స్పష్టతను ఇద్దామనుకుంది. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను విమర్శించడం ఆపడం లేదు. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చుని పాడింది. అది ఆమె చేసిన తప్పు. వాస్తవానికి మన జాతీయ గీతం లేదా గేయం ఏదైనా సరే పాడినప్పుడు కచ్చితంగా వాటిని గౌరవిస్తూ లేచి నిలుచోవాల్సిందే. కానీ అనసూయ అలా చేయకుండా కూర్చోవడంపై వివాదం చెలరేగుతోంది.
ఇక గణతంత్ర దినోత్సవం అంటే అంబేద్కర్ బొమ్మ వేసుకోవాలి కానీ టీషర్టుపై గాంధీ బొమ్మ ఏమిటని కూడా కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన అనసూయ కామెంట్ పెట్టింది.
అరే.. ఏందిరా భాయ్ మీ లొల్లి.. నేషనల్ యాంథెమ్ అంటారు. గాంధీకి, కాన్‌స్టిట్యూషన్ కి సంబంధమేందంటారు.. మరి జన గణ మణ ఏంది ? ఆగస్టు 15, 1947 అయితేనే 26 జనవరి 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా.. మాట్లాడుర్రి.. హ్యాపీ రిపబ్లిక్ డే మరి.. అంటూ అనసూయ పోస్ట్ పెట్టింది.
అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే అనసూయకు ఇది తలనొప్పిగా మారింది. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…