Aryan Khan : క్రూయిజ్ షిప్ లో ఓ డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ ఆర్యన్‌ఖాన్ మరిన్ని చిక్కుల్లో ఇరుక్కోబోతున్నాడా ? అంటే.. అందుకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అనన్య పాండేను ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్న విషయం విదితమే. అయితే విచారణలో భాగంగా ఆమె ఆర్యన్ ఖాన్‌కు సంబంధించి నిజాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పుచ్చుకున్నాడా ? లేదా ? అని ఎన్‌సీబీ అధికారులు అనన్య పాండేను ప్రశ్నించారట. అయితే ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నాడు కానీ.. అతనికి ఆ డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ? అన్న వివరాలు మాత్రం తెలియవట. దీంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. ఈ క్రమంలో ఆర్యన్‌ఖాన్ గురించి అనన్య మరిన్ని నిజాలు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నిజాలు చెప్పకపోతే అనవసరంగా తాను ఇరుక్కుంటానేమోనని భయపడ్డ అనన్య అప్రూవర్‌గా మారిందని తెలుస్తోంది. అందుకనే తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదని, ఆర్యన్ వాటిని తీసుకున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే కోర్టు పలుమార్లు తిరస్కరించగా.. మంగళవారం కూడా మరోమారు బెయిల్ పిటిషన్‌ను విచారించనున్నారు. కానీ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువు అయితే అతనికి బెయిల్ రాకపోవచ్చని అంటున్నారు.
ఇక షారూఖ్ ఖాన్ మేనేజర్ పూజ ఎన్‌సీబీ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ గంటన్నర పాటు ఉంది. తరువాత తిరిగి వచ్చాక ఆమె చేతిలో ఒక ఎన్వలప్ కనిపించింది. అందులో ఆర్యన్ ఖాన్‌కు చెందిన కీలక పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…