Ananya Panday : అనన్య పాండే ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ అమ్మడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫొటోషూట్స్‌తో బిజీగా ఉంది. ఫ్యాషన్‌కు మారుపేరుగా ఉండే అనన్య పాండే ఎల్లప్పుడూ వెరైటీ దుస్తులను ధరిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా నటించిన గెహ్రాయియా అనే చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.

తాజాగా అనన్య పాండే తెలుపు రంగు కోర్‌సెట్ డ్రెస్ ధరించి అందాలను ఆరబోసింది. ఈ అమ్మడు కాళ్ల సౌందర్యాన్ని చూస్తుంటే మతులు పోతున్నాయి. అనన్య పాండే బ్లూ కలర్ బ్లేజర్ ధరించి ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంది.
Ananya Panday : ఇంటర్నెట్ షేక్..
ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు రూ.40వేలకు పైమాటే. అలాగే ఇయర్ రింగ్స్ ఖరీదు రూ.14వేలు. ఈ క్రమంలోనే ఇలాంటి డ్రెస్‌లను ధరించి అనన్య పాండే ఎప్పుడూ అందాలను ఆరబోస్తోంది.
ఈమె నటించిన గెహ్రాయియా చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతోంది. ఇందులో దీపికా పదుకొనె కూడా నటించింది. అలాగే పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాలోనూ విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ వచ్చే ఆగస్టులో రిలీజ్ కానుంది.