Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది దసరా సమయంలో నిర్వహించేలాగానే ఈసారి కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుంది. ఇప్పటికే ఈ సేల్‌పై ప్రకటన చేయగా.. ఇప్పుడు అధికారిక తేదీని ప్రకటించింది. ఈ సేల్‌ను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నామని అమెజాన్ తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ సేల్‌లో అనేక ఆఫర్లతోపాటు భారీ తగ్గింపు ధరలను కూడా అందివ్వనున్నారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా.. ఈ సేల్ ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ దీపావళి పండుగ వరకు ఈ సేల్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై అమెజాన్ త్వరలో మళ్లీ ఇంకో తేదీని ప్రకటిస్తుందని సమాచారం. ఇక ఈ సేల్‌లో భాగంగా అనేక కంపెనీలకు చెందిన అనేక రకాల ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. అలాగే అనేక ఆఫర్లను కూడా అందివ్వనున్నారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ 11 ప్రైమ్ 5జి, రెడ్‌మీ ఎ1 ఫోన్లను లాంచ్ చేసి విక్రయిస్తారు. అలాగే ఫోన్లపై 40 శాతం వరకు రాయితీలను అందిస్తారు. ఈ క్రమంలోనే శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జి, ఐక్యూ 9టి, రెడ్‌మీ నోట్ 11, షియోమీ 11టి ప్రొ 5జి తదితర ఫోన్లపై డిస్కౌంట్లను పొందవచ్చు. అలాగే ఎల్‌జీ గ్రామ్ ల్యాప్‌టాప్ పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తారు. టీవీలు, గృహోపకరణాలపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ సేల్‌లో కిచెన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు రాయితీని అందివ్వనున్నారు. అలాగే ల్యాప్‌టాప్‌లపై 75 శాతం వరకు, అలెక్సా ఫైర్ టీవీ, కిండిల్ ఉత్పత్తులపై 55 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తారు. ఇక క్రెడిట్, డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…