Laugh : నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం ఒక రోగం అని అన్నారు ఓ మహాకవి. నవ్వు నాలుగు విధాల చేటు అంటారు మన పెద్దలు. కానీ ఆ నవ్వు వల్లనే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి మనిషికి దేవుడిచ్చిన వరం నవ్వు. పుట్టిన కొన్ని నెలల నుంచి చివరి ఊపిరి పోయే వరకూ ఏదో సందర్భంలో ప్రతి మనిషి నవ్వుతాడు. నవ్వు వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నవ్వు అనేది ముఖంలో పైకి కనిపించే మొదటి సంకేతం. దీనికి మెదడు, మనసు అంతర్గతంగా సహాయపడతాయి. ఆనందం, సంతోషం వంటి వాటిని మనం నవ్వుతోనే వ్యక్తం చేస్తాం. నవ్వొచ్చేటప్పుడు ఆపుకోవటం, ఆపుకోలేక నవ్వేయటం ఆయా సందర్భాలపై ఆధారపడి ఉంటుంది. ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, సంతోషంగా ఉన్నట్టు భావించినప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అదే సమయంలో ముఖంలోని కండరాలకు నాడీ వ్యవస్థ నుంచి సంకేతాలు అందుతాయి. దానితో నోటి చుట్టూరా ఉండే కండరాలు సంకోచించి నవ్వు పుట్టుకొస్తుంది.
నవ్వుతూ ఉండటం వలన శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎదుటి వారితో సంబంధాలు పెంపొందించేందుకు నవ్వు ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఒక చిన్న చిరునవ్వు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర ఒత్తిడి, ఆందోళన, కోపం తీవ్రతను తగ్గించటానికి నవ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు మొత్తం మనసారా నవ్వటం వలన బిపి, షుగర్ వంటివి అదుపులోకి వస్తాయి. నవ్వు అనేది ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.
ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ వలన నవ్వు అనే పదానికి దూరం అవుతున్నాము. రోజుకి కనీసం ఐదు లేదా పది నిముషాలు నవ్వటం వలన ముఖంలోని కండరాలకు మంచి వ్యాయామం అయ్యి ముడతలు తగ్గుతాయి. కామెడీ చిత్రాలు చూడడం, జోక్స్ పుస్తకాలు చదవటం, వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవటం ద్వారా కూడా మనసారా నవ్వవచ్చు. ఇరుగు పొరుగు వారితో తరచూ మాట్లాడటం వలన వారితో సామజిక సంబంధాలు మెరుగు అవ్వటమే కాకుండా, మాటల సందర్భంలో మనసారా నవ్వడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…