Amala Paul : నటి అమలా పాల్ ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 2014 లో తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ని పెళ్లి చేసుకున్న ఈమె 2017లో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తరువాత 2018లో భవిందర్ సింగ్ అనే రాజస్థాన్ కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుండి ఎదో ఒక వివాదం ఆమెను చుట్టు ముడుతూనే ఉంది. ఆ తరువాత వారిద్దరూ కలిసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు.
నవంబర్ 2020 లో అమలా పాల్ అతనిపై పరువు నష్టం కేసు వేసింది. తామిద్దరం కలిసి 2018లో దిగిన ఫోటోషూట్ కి చెందిన తన వ్యక్తిగత ఫోటోలను భవిందర్ తన అనుమతి లేకుండా సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాడని, దాని వలన తాను మానసిక క్షోభను, ఒత్తిడిని ఎదుర్కొన్నాని పేర్కొంటూ అతనిపై మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. అప్పట్లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే అవి కేవలం ఫోటోషూట్ లో భాగంగా తీసిన చిత్రాలే అని అమలా పాల్ వివిరణ ఇచ్చింది. దాంతో వారి రిలేషన్ షిప్ కి బ్రేక్ పడిపోయింది.
అయితే ఇప్పుడు అమలా పాల్ తాజాగా భవిందర్ సింగ్ పై మరో కేసు వేసింది. భవిందర్ ఇంకా అతని కుటుంబ సభ్యులు కలిసి తమ భాగస్వామ్య నిర్మాణ సంస్థలో నుండి తనును డైరెక్టర్ గా తొలగించి నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా తన ఆస్తులను కాజేశారని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా భవిందర్ తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన తన వ్వక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో అమలా పాల్ మాజీ ప్రేమికుడైన భవిందర్ సింగ్ ను తమిళనాడులోని విల్లుపురం జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు చీటింగ్ ఇంకా వేధింపుల కేసు కింద అరెస్టు చేశారు.
ప్రస్తుతం అమలా పాల్ కీలక పాత్రలో నటించిన కడవెర్ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇంకా తను మళయాల నటుడు మమ్ముట్టితో చేసిన క్రిస్టోఫర్ అలాగే పృథ్వీరాజ్ తో చేసిన ఆడుజీవితం అనే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…