Allu Sirish : తండ్రి, అన్న‌కు దూరంగా శిరీష్‌.. కుటుంబం నుంచి విడిపోయిన‌ట్లే..? ఎందుక‌ని..?

Allu Sirish : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో చిత్రాలను నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విజేత, రౌడీ అల్లుడు, జల్సా, 100% లవ్, సరైనోడు, గీతగోవిందం, అల వైకుంఠపురంలో వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట్ నిర్మాతగా మారాడు. ఇక రెండవ కుమారుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. అందరి కంటే చిన్న కుమారుడు శిరీష్ సైతం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త‌న‌కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

2013లో గౌరవం చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఇతను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా దాదాపు ఆరు చిత్రాల కన్నా ఎక్కువగా నటించలేదు. నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోగా సూపర్ హిట్ సక్సెస్ ను మాత్రం అందుకోలేదు. టాలెంట్ ఉన్నా కూడా శిరీష్ కి కాలం కల‌సి రాలేదు. మొదట అల్లు అర్జున్ కూడా గంగోత్రి చిత్రంతో ఇతను కూడా ఒక హీరో అనే టాక్ ను అందుకున్నాడు. తర్వాత ఆర్య చిత్రంతో సక్సెస్ ను అందుకుని వరుస ఆఫర్లు చేజిక్కించుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా హోదాను సంపాదించుకున్నాడు. శిరీష్ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది.

Allu Sirish

ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. శిరీష్ చివరిగా న‌టించిన‌ ఎబిసిడి చిత్రం 2019 లో విడుదలైంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రేమ కాదంట ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సరైన సక్సెస్ లేని శిరీష్ చిత్రం చేయడం అనేది జరుగుతుందో లేదో అనే వార్త వినిపిస్తోంది. ఇప్పటివరకు చిత్ర యూనిట్ కూడా ఎటువంటి అప్‌డేట్స్‌ను ఇవ్వలేదు. ఈ క్రమంలో శిరీష్ తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారట. అటు తండ్రి అల్లు అరవింద్ గానీ, ఇటు అన్న అల్లు అర్జున్ గానీ తన కెరీర్ గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారట. తండ్రి అల్లు అరవింద్ అన్న అర్జున్ కెరీర్ ని ఎంతో గొప్పగా నిర్మించారు. నన్ను మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు అంటూ బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నాడ‌ట‌. అల్లు అర్జున్ భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధ నాపై లేదని శిరీష్ తండ్రిపైన ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది.

తండ్రి అల్లు అరవింద్ తలచుకుంటే తన కెరీర్ ను కూడా గొప్పగా నిలబెట్టగలరు. కానీ ఆయన నా గురించి శ్రద్ధ తీసుకోవడం లేదని మనోవేదనకు గురయ్యారని తెలుస్తోంది. కొంతకాలంగా శిరీష్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. కెరియర్ పరంగా మనోవ్యధ కారణంగానే శిరీష్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వార్త వినిపిస్తోంది. అంతేకాకుండా శిరీష్ కొంతకాలంగా అను ఇమ్మానియేల్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శిరీష్ కుటుంబ సభ్యులతో విడిపోయి ముంబైలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ, ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM