Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా తమిళ కేరళ రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఆ భాషలలో ప్రసారం అవుతుండగా ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక బన్నీకి కేరళలో ఎక్కువ అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ కేరళ అభిమాని అల్లు అర్జున్ కు ఎంతో ప్రత్యేకమైన బహుమతి అందించారు.

ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ గత కొద్ది రోజుల క్రితం యూఏఈ వెళ్లగా అక్కడ బన్నీని అక్కడే నివాసముంటున్న కేరళ అభిమాని కిల్టన్ కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్‌ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని కిల్టన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.