Allu Arjun : పుష్ప సినిమా ఇచ్చిన హిట్ కారణంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయి నటుడిగా మారాడు. దీంతో ఆయనతో హిందీలో సినిమాలు చేసేందుకు అక్కడి నిర్మాణ సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక ఓ తమిళ నిర్మాణ సంస్థ అయితే అల్లు అర్జున్‌తో సినిమా తీస్తే ఆయనకు ఏకంగా రూ.100 కోట్ల మేర రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిందట. కానీ అల్లు అర్జున్ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
ఇక బన్నీ పలు బ్రాండ్లకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న విషయం విదితమే. తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఈ క్రమంలోనే ఓ యాడ్ కూడా చేశాడు. అది ఆకట్టుకునే విధంగానే ఉన్నప్పటికీ వివాదానికి దారి తీసింది. అయితే సదరు జొమాటో యాడ్‌లో నటించినందుకు గాను అల్లు అర్జున్‌కు భారీ మొత్తమే రెమ్యునరేషన్‌గా ఇచ్చారట.
మూడేళ్ల కాలానికి గాను అల్లు అర్జున్‌తో జొమాటో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందట. ఈ క్రమంలోనే ఈ సమయంలో అల్లు అర్జున్ జొమాటో యాడ్స్‌లో నటించాల్సి ఉంటుంది. అందుకు గాను ఆ సంస్థ ఏకంగా రూ.9 కోట్లను అల్లు అర్జున్‌కు ఇచ్చిందట. ఇటీవల మహేష్ బాబు మౌంటెయిన్ డ్యూ సంస్థకు యాడ్ చేసిన విషయం విదితమే. ఆయన 3 ఏళ్ల కాలానికి గాను రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకన్నా ఒక కోటి మాత్రమే తక్కువగా రూ.9 కోట్లను అల్లు అర్జున్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో అల్లు అర్జున్ మరిన్ని జొమాటో యాడ్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…