Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మొదటి పార్ట్ అందించిన జోష్‌లో ఉన్నారు. పుష్ప 2 ఇంకా మొదలు కాలేదు. కానీ ఆ మూవీ ప్రారంభం అయ్యేలోగా వీలైనన్ని ఎక్కువ టూర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ఇటీవల దుబాయ్ వెళ్లగా.. ఇప్పుడు కుటుంబంతో కలిసి మళ్లీ టూర్‌కు వెళ్లారు. ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీ లండన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి ఫొటోలను అల్లు అర్జున్ షేర్ చేస్తున్నారు.
ఇక లండన్‌లో బన్నీ భార్య స్నేహా రెడ్డి కూడా ఫొటోలను దిగి షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్‌కు చెందిన ఫొటోను షేర్ చేశారు. అందులో మై నింజా బాబు అని అల్లు అర్జున్ కాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫొటోకు కేవలం ఒక గంట వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా బన్నీ కొడుకును ఇలా చూసిన ఆయన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

కాగా పుష్ప 2 షూటింగ్ ఈపాటికే ప్రారంభం కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ మొదటి పార్ట్‌కు రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. అయితే రెండో పార్ట్‌కు రెమ్యునరేషన్ వద్దని.. హిందీ హక్కులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని అల్లు అర్జున్ పట్టుబడుతున్నారట. దీంతో నిర్మాతలకు, అల్లు అర్జున్‌కు మధ్య చర్చలు ఇంకా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ వస్తే త్వరలోనే పుష్ప 2 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2వ పార్ట్‌లో పుష్పకు, భన్వర్ సింగ్ షెకావత్‌కు మధ్య పోరాటం ఉంటుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.