Allu Aravind : కొన్నేళ్లుగా మా మధ్య జరుగుతుంది అదే.. మెగా ఫ్యామిలీతో విభేదాలపై స్పందించిన అల్లు అరవింద్‌..!

Allu Aravind : టాలీవుడ్ లో అత్యధిక స్టార్స్ మెగా ఫ్యామిలీకి చెందినవారే. చిరంజీవి అనే వటవృక్షం క్రింద అరడజనుకు పైగా హీరోలు పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్స్ గా ఎదిగారు. అలాగే సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ మోస్తరు హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాస్తా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీగా విడిపోయాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాక ఈ దూరం మరింత పెరిగిందని, కొన్నాళ్లుగా అల్లు అర్జున్ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్నారని, ఆయన అల్లు రామలింగయ్య మనవడిగా పిలవబడడానికే ఇష్టపడుతున్నాడని, మెగా ట్యాగ్ ఆయనకు నచ్చడం లేదని సమాచారం.

ఇటీవల ఓ సందర్భంలో బన్నీ అవర్ ఫౌండేషన్ అంటూ అల్లు రామలింగయ్య ఫోటో పోస్ట్ చేశాడు. దీంతో తన అభివృద్ధికి కారణం తాతయ్య కానీ, మేనమామ కాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. మొదటి నుంచి ఉన్న బంధమే ఇప్పుడు కూడా ఇరు కుటుంబాల మధ్య ఉందని తేల్చి చెప్పేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అరవింద్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ బల్ల గుద్దిచెప్తున్నాను. అలాంటిదేమి లేదు. అయితే ఇరు కుటుంబాలు కలుసుకోవడం లేదు అన్నది వాస్తవమే.. ఎందుకంటే పిల్లలు పెద్దవారు అవుతున్నారు.. ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా ఉంటున్నారు.

Allu Aravind

అందరికీ ఒకేసారి టైం కుదరడం లేదు. కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా అందరు ఒక్క చోట చేరిపోతారు. మా మధ్య సంబంధాలు తెగిపోయాయి అనేది కేవలం పుకారు మాత్రమే. మేమంతా కలిసి పండుగలు సెలబ్రేట్‌ చేసుకుంటామని వీడియోలు తీసి చూపించాలా? అలా పెట్టలేం కదా.. కాంపిటీషన్‌లో ఎవరికి వాళ్లు పైకి వస్తున్నారు. కానీ అంతా ఒక్కటే అని క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్‌. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ (గీతా ఆర్ట్స్)ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు అల్లు రామలింగయ్య పేరుతో ఫిల్మ్ స్టూడియోని కూడా నిర్మించారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM