Allu Aravind : గత కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి , మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు ముగింపు వచ్చినట్టుగానే అనిపిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అల్లు అర్జున్ 6 సంవత్సరాల క్రితం ఒక సినిమా వేడుక లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి వారి డిమాండ్ కి బదులుగా చెప్పను బ్రదర్ అని సంభోదించడం జరిగింది. ఇక అప్పుడు మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పుష్ప సినిమా పాన్ ఇండియా సక్సెస్ తర్వాత అది తారా స్థాయికి చేరింది.
మెగా అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక వర్గం వారు చిరంజీవికి హీరో రామ్ చరణే అసలైన నట వారసుడని ఆయనకి మద్దతుగా ఉండగా, కొందరు అల్లు అర్జున్ కి మాత్రమే అభిమానులమని చెబుతున్నారు. రియల్ మెగాస్టార్ ఎవరనే విషయంలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి.
ఇక అల్లు అరవింద్ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్య్వూలో ఇరువురి కుంటుంబాలపై వస్తున్న అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కి దేవుడితో సమానమని అది చివరి శ్వాస వరకు ఉంటుందని అన్నారు. ఇంకా ఆయన విభేదాల గురించి మాట్లాడుతూ.. రెండు కుటుంబాలలో మంచి నటులు ఉన్నారని, విజయవంతం కూడా అయ్యారని అన్నారు. అంతే కాకుండా సినిమాల పరంగా పోటీ ఉంటుందని, కానీ ఫ్యామిలీ విషయం వచ్చేసరికి వారంతా ఒక్కటే అని వివరణ ఇచ్చారు. ఇకనైనా అభిమానులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటారో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…