Alia Bhatt : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ఓ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో అలియా భట్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కేవలం 10 రోజులు మాత్రమే. వసూలు చేసింది మాత్రం 5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ . అంటే రోజుకు 50 లక్షల పారితోషికం అందుకుంటుంది ఆలియా. బాలీవుడ్‌లో ఒక సినిమాకు రూ.10 కోట్లు తీసుకునే ఆలియా భట్.. అక్కడి కంటే ఎక్కువే చార్జ్ చేస్తోంది.
హిందీలో ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు నెలలు కాల్షీట్స్ ఇస్తారు.. కానీ ఇక్కడ పది రోజులకే రూ.5 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలి అంటే ఆలియా భట్ ఉండాల్సిందేనంటూ జక్కన్న కోరడంతో నిర్మాత కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగినంత ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు.
ఇప్పటికే సీతగా ఆలియా భట్ ప్రీ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా సీతగా ఆలియా పూర్తి స్థాయి లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ఆలియా భట్ సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తోంది. తన ప్రియుడు రామరాజు కోసం ఎదురు చూసే యువతి పాత్రలో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…