Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఈ బ్యూటీ తాజాగా తన ప్రియుడు రణబీర్ కపూర్ కు పుట్టినరోజు (సెప్టెంబర్ 28) శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ క్రమంలోనే తన ప్రియుడు రణబీర్ కపూర్ కి హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట సినిమాల పరంగా ఏ మాత్రం ఖాళీ దొరికినా విహార యాత్రలకు వెళుతూ తమ ఏకాంత సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వీరి ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది వీరి వివాహం జరగాల్సి ఉండగా రణబీర్ కపూర్ తండ్రి మరణించడంతో వీరి పెళ్లి వాయిదా పడింది.
https://www.instagram.com/p/CUXaCn9sh1e/?utm_source=ig_web_copy_link
రణబీర్ కపూర్ తండ్రి మరణించిన సమయంలో ఆలియా కూడా తన సొంత మనిషిని కోల్పోయినట్టు ఎంతో బావోద్వేగం అయ్యింది. అప్పట్లో ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా రణబీర్ కపూర్ ను తన లైఫ్ అంటూ సంబోధిస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.