Akira Nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అకీరా నందన్ ఈ మధ్యే తన బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. దీంతో అతన్ని తండ్రికి తగ్గ తనయుడు అని ఫ్యాన్స్ అందరూ అభిమానించారు. అలాగే తనలోని టాలెంట్‌లను కూడా అకీరానందన్ బయట పెడుతూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పియానోపై పలు పాటలను వాయించిన అకీరా నందన్ తనలోని సంగీత టాలెంట్‌ను బయట పెట్టాడు. అయితే తాజాగా మరోమారు పియానోపై ఓ సాంగ్‌ను వాయించి అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
అకీరా నందన్ తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ సినిమాలోని.. హృదయమా.. అంటూ సాగే పాటను పియానోపై వాయించాడు. ఈ క్రమంలోనే అడివి శేష్ ఈ పాటకు చెందిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి దానికి ఒక కామెంట్ పెట్టాడు. నా కోసం ఈ సాంగ్‌ను కంపోజ్ చేసినందుకు అకీరా నందన్‌కు చాలా థ్యాంక్స్.. అంటూ శేష్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ వైరల్ అవుతుండగా.. మరోమారు అకీరానందన్ లో ఉన్న టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అతన్ని జూనియర్ పవర్ స్టార్ అని కొనియాడుతున్నారు.
ఇక అకీరానందన్ గతంలోనూ పలు పాటలను వాయించాడు. ఈ మధ్యే తన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్‌లోని దోస్తీ పాటను కీబోర్డుపై వాయించి ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమానికి పవన్, రేణు ఇద్దరూ హాజరు కావడం విశేషం. ఇక అడివి శేష్ మేజర్ విషయానికి వస్తే.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో వసూళ్ల దిశగా ముందుకు సాగుతోంది. జూన్ 3వ తేదీన విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో ప్రేక్షకులు సహజంగానే ఈ మూవీని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లోనూ ఈ మూవీ రికార్డులను సృష్టిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…