Akira Nandan : అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ సినిమాలు మానేశాడు. దీంతో కొన్నాళ్లు ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక పవన్ తనయుడి ఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తుండగా, ఓ వార్త అభిమానులని ఆనందింపజేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట.
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎ.ఎం.రత్నం నిర్మాత. ఇప్పటికే సినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. భీమ్లా నాయక్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత పవన్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెడతారని సమాచారం. బందిపోటు పాత్రలో పవన్ కనిపించనుండగా, మొఘలు చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
చిత్రంలో తండ్రీ – కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని, కొడుకు పాత్రలో అకీరా అయితే బాగుంటుందని భావించిన క్రిష్.. అకీరాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అకీరా కర్రసాము నేర్చుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది త్వరలోనే తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…