Akhil Akkineni : అక్కినేని అఖిల్ రీసెంట్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అఖిల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇందుకోసం విభిన్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపిస్తూ డిఫరెంట్ డిజైనర్ దుస్తులలో మెరుస్తున్నాడు.
చాలా మంది ఫ్యాషన్ కోసం రుద్రాక్ష మాలను చేతికి స్టైల్ గా ధరిస్తున్నారు. కొందరు హిందుత్వ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని.. రుద్రాక్ష అంటే శివుడి స్వరూపంగా భావిస్తాం. కనుక అలా చేయకూడదు అంటూ కొందరు అంటున్నారు. అఖిల్ కూడా రుద్రాక్ష మాలను ధరించండంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సెలబ్రెటీ రుద్రాక్ష మాలను చేతికి చుట్టుకోవడం ద్వారా ఇది అందరికీ అలవాటు చేసిన వారవుతారు అని మండిపడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా అఖిల్ క్లారిటీ ఇచ్చాడు. రుద్రాక్ష చేతికి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఒకరు చెప్పారు. అందుకే ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తాను తన చేతికి ధరించినట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్ భక్తితోనే రుద్రాక్షను ధరించడం అంటూ క్లారిటీ ఇవ్వడంతో ట్రోల్స్ కాస్త ఆగాయని చెప్పాలి. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందగా, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో అఖిల్ విభిన్నమైన పాత్రను పోషించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…