Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సినీ కెరీర్ లో హిట్ కొడదామని తహతహలాడుతున్న అక్కినేని వారసుడు అఖిల్ తన సినిమా ప్రమోషన్స్ లో చాలా వేగంగా, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతో బజ్ ని క్రియేట్ చేసిన అఖిల్ బుల్లితెర ఛానెల్స్ లో పలు టీవీ షోస్ కి వచ్చి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలతో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇంటర్వ్యూ మోడ్ లో పార్టిసిపేట్ చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో అమ్మాయిలు అఖిల్ ని ఇంటర్వ్యూ చేస్తారు. అలా ఓ అమ్మాయి అఖిల్ ని యూ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అందరికీ తెలుసు. బట్ మీరు ఎంతమంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశారని అడుగుతుంది. ఈ క్వశ్చన్ కి అఖిల్ రెస్పాండ్ అవుతూ.. తన 13 ఏళ్ళ వయస్సులోనే ఓ అమ్మాయికి తన గర్ల్ ఫ్రెండ్ లా ఉండమని ప్రపోజ్ చేశానని అన్నాడు.
తన మోకాళ్ళ మీద నిలబడి మరీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశానని అన్నాడు. తన స్కూలింగ్ లో అలా ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదని, ఆ తర్వాత చాలా స్మార్ట్ అండ్ మెచ్యూర్డ్ అని నవ్వుతూ ఆన్సర్ చేశాడు. ఆ తర్వాత మరో అమ్మాయి అఖిల్ డైట్ గురించి అడిగితే.. తాను స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తింటానని, ఎవరూ నమ్మరని అంటాడు. ఇలా ఫన్నీ ఇంటర్వ్యూలో అఖిల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం పాల్గొన్నాడు. ఈ సినిమాని అక్టోబర్ 15న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.