Ajith Thegimpu Movie : అజిత్ న‌టించిన లేటెస్ట్ మూవీ తెగింపు ఓటీటీలో.. ఎందులో అంటే..?

Ajith Thegimpu Movie : థియేట‌ర్స్‌లో విడుద‌లైన కొద్ది రోజులకి సినిమాలు ఓటీటీలో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక అజిత్ న‌టించిన తెగింపు చిత్రం సంక్రాంతికి విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌గా, ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అజిత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ హైప్ బాగానే ఉంటుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అజిత్ సరికొత్త లుక్‌లో అల్ట్రా స్టైలిష్ స్వాగ్‌తో కనిపించిన తీరు ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకుంది. తునివు సినిమా రిలీజ్‌కు ముందే, ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే తెగింపు సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండ‌డంతో పాటు అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆక్టుటకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ సినిమాకు తమిళంలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. రిలీజైన నెల రోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని అంటున్నారు.

Ajith Thegimpu Movie

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. తెగింపు మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. స్ట్రీమింగ్ వచ్చేసి ఫిబ్రవరి 10 నుండి కానుందని తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై మేకర్స్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు తెగ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు వినోద్. ఇదే కథను కాస్త అటూ ఇటూగా సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో చెప్పించాడు దర్శకుడు పరశురామ్. అందులోనూ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా వ్యక్తుల గురించి చెప్పుకొచ్చాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM