Aha 2.0 : తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నంబర్ వన్ దిశగా దూసుకుపోతోంది. ఇక రోజు రోజుకీ ఆహా సబ్ స్కైబర్స్ సంఖ్య పెంచుకుంటూ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని నిరూపించుకుంటోంది ఆహా.
ఇప్పుడు ఆహా సేవలను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ఆహా 2.0 అవతరించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆహా 2.0కి లక్ష్మీ మంచు యాంకరింగ్ చేస్తుండగా.. ఆహా 2.0 లోగోను అల్లు అరవింద్, రామూ రావు జూపల్లి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆహా ప్రారంభించేటప్పుడు ఎన్నో అనుమానాలు వచ్చాయని, కొత్త పని చేస్తున్నాము రిజల్ట్ ఎలా వుంటుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన జూపల్లి ఫ్యామిలీ.. నా విజన్‌ని సపోర్ట్ చేస్తూ దైర్యాన్ని ఇచ్చారని అన్నారు.
తెలుగు వాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అదరించినట్టు ఏ రాష్ట్రంలోనూ ఆదరించరని అల్లు అరవింద్ అన్నారు. ఆహాలో ఇప్పటివరకు చూసిన కంటెంట్ వేరు ఇప్పుడు 2.0లో రాబోయే కంటెంట్ వేరు.. కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. ఆహా 2.0లో సుపీరియర్ వెబ్ సిరీస్, సుపీరియర్ ఫిల్మ్స్ రాబోతున్నాయని అన్నారు అల్లు అరవింద్. ఆయన మాటలతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…