Divorce : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. మన దేశంలోనూ ఏటా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. భార్యా భర్త విడాకులు తీసుకునేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. అది విడాకులకు దారి తీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మేరకు పలువురు సైంటిస్టులు చేపట్టిన వేర్వేరు అధ్యయనాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.
న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాలా ఇంగ్లండ్ బృందం 3622 జంటలపై అధ్యయనం చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడ్డాయి. విడాకులు కోరుతున్న వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారి శాతం 87 గా ఉందని తెలిపారు. కొన్ని జంటల్లో భార్యల వయస్సు భర్తల కన్నా 3 ఏళ్లు ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వారిలో భర్తలు ముందుగా విడాకులు కోరుతున్నారని తెలిపారు. భార్య తన కన్నా ఎక్కువ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని, పరిపక్వతతో ఆలోచిస్తుందని భావించే వయస్సు తక్కువ ఉన్న భర్తలు ముందుగా విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు.
ఇక భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ 5 అంతకన్నా ఎక్కువగా ఉన్నా మంచిది కాదని.. ఇలాంటి జంటలు కూడా విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు హౌజ్ హోల్డ్, ఇన్‌కమ్ అండ్ లేబర్ డైనిమక్స్ ఇన్ ఆస్ట్రేలియా అనే అధ్యయనంలో వివరాలను వెల్లడించారు. ఇలాంటి జంటల్లో భర్త వయస్సు ఎక్కువగా ఉంటుందని, అతను చెప్పే విషయాలను వయస్సు తక్కువగా ఉండే భార్య అర్థం చేసుకోలేకపోతుందని.. అందుకనే భర్తలు విడాకులు కోరుతున్నారని వెల్లడైంది.
అయితే భార్య భర్తల వయస్సు సమానంగా ఉంటే వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని.. వారు విడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. అలా కాకుండా భార్యా భర్తల్లో ఏ ఒక్కరి వయస్సు ఎక్కువగా ఉన్నా.. వారు విడిపోయే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇక 23 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునే వారు కూడా త్వరగా విడాకులు తీసుకుంటారని వెల్లడించారు. 32 దాటాక కూడా వివాహం చేసుకుంటే విడాకులు తీసుకునే అవకాశాలు పెరుగుతాయని, కనుక 24 నుంచి 30 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…