Adipurush : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్.. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా చేస్తోంది. ఇక రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో 3డిలో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి 3 నెలలకు పైగానే అవుతోంది. మరోవైపు పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేందుకే కొన్ని ఏళ్లు పడుతుందని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ ఈ చిత్ర షూటింగ్ కేవలం 103 రోజుల్లోనే పూర్తయింది. అవును.. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ స్వయంగా తెలియజేశారు.
ఆది పురుష్ మూవీ షూటింగ్ 103 రోజుల్లో పూర్తయ్యింది. ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. అని అన్నారు. కాగా ఈ మూవీని భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ మూవీతోనూ అలరించనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…