Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆది పురుష్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఉత్కంఠగా ఉన్నారు. ప్రభాస్ బాహుబలి తరువాత నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో మంచి హిట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ నటించిన ఆది పురుష్ తరువాత చిత్రంగా విడుదల కానుంది. దీంతో అన్ని ఆశలూ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు.
ఇక ఆది పురుష్ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. రాముడిగా ప్రభాస్ లుక్‌ను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రీ లుక్ పోస్టరే ఇలా ఉంటే.. రేపు సినిమా ఎలా ఉంటుందోనని.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పోస్టర్‌లో ప్రస్తుతం కొందరు తప్పులు వెతికే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే పోస్టర్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో చెప్పులు ధరించి ఉండడాన్ని వారు ట్రోల్ చేస్తున్నారు. రాముడు ఎంత స్టైలిష్ చెప్పులను ధరించాడో కదా.. అంటూ హేళన చేస్తున్నారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయనపై వస్తున్న ట్రోల్స్‌ను తిప్పికొడుతున్నారు. ఆ కాలంలో పాదుకలు ధరించేవారని.. రామాయణం, భారతం తెలిసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది.. అనవసరంగా ప్రభాస్ చెప్పులపై కామెంట్స్ చేయవద్దని అంటున్నారు. అయితే వాస్తవానికి త్రేతాయుగంలో ఆ తరువాత ద్వాపర యుగంలో పాదుకలను చాలా మంది ధరించేవారు. ఇందులో తప్పేమీ లేదు. ప్రభాస్ రాముడి పాత్రలో ధరించినవి కూడా అలాంటివే. కనుక ఇందులో తప్పుబట్టాల్సిన పనిలేదు. మరి పని కట్టుకుని మరీ కొందరు ఇలా ఎందుకు చేస్తున్నారు.. అనేది అర్థం కావడం లేదు. ఇక ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.