Adi Purush : ప్రభాస్, కృతిసనన్ ప్రధాన పాత్రలలో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆదిపురుష్ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుండగా, ఈ సినిమాకు ఆరంభంలోనే ఆటంకం ఎదురైందన్న సంగతి తెలిసిందే. మొదటి రోజే షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం ఏర్పడింది. ఆ తర్వాత కరోనా వలన కొద్ది రోజులు అవాంతం ఏర్పడింది. ఇప్పడు పరిస్థితులు మళ్లీ అనుకూలిస్తుండడంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్ కు వీడ్కోలు పలుకుతూ, సెట్ లో కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను దర్శకుడు ఓంరౌత్ శనివారం ట్వీట్ చేశారు. సైఫ్ తో షూటింగ్ ఎంతో వినోదాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ‘ఆదిపురుష్’ కోసం వర్క్ చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని సైఫ్ సైతం పేర్కొన్నాడు. ముంబై నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ వేగంగా జరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఐదు భాషల్లో ఇది తెరకెక్కుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…