Actor Shivaji : టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుడిగా చంద్రబాబు గెలుపుకోసం బాగానే కష్టపడ్డారు. ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ మీటింగ్‌లో పాల్గొన్న హీరో శివాజీ వైసీపీపై పొలిటికల్ పంచ్‌లు వేశారు.
శివాజీ మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా.. నిజాయితీగా ఉన్న నాయకుడ్ని ఎన్నుకోండి. వెయ్యి, రెండువేలకు ఓట్లు అమ్ముకోవద్దు. నోటు, ఓటు, కోటర్‌కి పడిపోవద్దు.. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదని అంటారు.. అది అక్షరాలా నిజం. అందుకోసం ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మనకి అనవసరం. ప్రస్తుతకాలంలో కబ్జాలు, ఇసుక, మందు దందాలు నడుస్తున్నాయి. వీళ్లు ఏమనుకుంటున్నారంటే.. జనానికి డబ్బు పెట్టేశాను కదా.. ఓట్లు పడతాయిలే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో నుంచి బయటకురా.. జనంలోకి వచ్చి చూడు.. నీకు ఓట్లు వేయరు. నేను ఇప్పటికి 42 నియోజక వర్గాల్లో సర్వే చేయించాను. దీపావళి, సంక్రాంతి మధ్యలో నా సర్వే రిపోర్ట్ ఇస్తాను. నిజం చెప్పాలంటే.. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లతో బయటపడతారు అన్నాడు శివాజీ.
గోరంట్ల మాధవ్ ఏం చేశాడో సీఎంకు తెలుసు.. కానీ ఎందుకు ఊరుకుంటున్నారంటే.. ఈయన గురించి మాట్లాడితే అంబటి గురించి అవంతి గురించి మాట్లాడాలి, ఎందుకొచ్చిందిలే అని.. ఏమండీ గురువుగారూ మనోడిది ఏం లేదని చెప్పేయండని అన్నారు.. ఆయన చెప్పేశారు అంటూ సెటైర్లు వేశారు శివాజీ. ఆ వీడియో మాధవ్‌ది కాదంట.. నాదంట.. మరి నిజంగానే నాదేనేమో! జగన్ గారికి కూడా తెలుసు ఆ వీడియో ఎవరిదో. అందుకే వచ్చే ఎన్నికలకు మాధవ్‌కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఆ వీడియో మాధవ్‌దే అని జగన్ గారికి తెలుసు.. కానీ చెప్పరు.. ఎందుకంటే అదే రాజకీయం ! వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని నటుడు శివాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…