Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల తర్వాత ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయనుంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవితోపాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు.
ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డె నటించింది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో గెస్ట్ పాత్ర పోషించిన పూజా హెగ్డెని చూపించారు కానీ, ప్రధాన కథానాయిక అయిన కాజల్ ఒక్క ఫ్రేములో కూడా కనిపించలేదు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముందుగా ఆచార్య చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిషను తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆచార్యలో తన పాత్రకు కనీస ప్రాధాన్యత లేదనే కారణంగానే త్రిష తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాజల్‌కి మెగా ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వలన ఆమెని ఎంపిక చేశారు. అయితే ట్రైలర్ విడుదల తర్వాత త్రిష ఎందుకు తప్పుకుందనేది అర్ధమైంది. కాజల్ కేవలం రెమ్యునరేషన్ కోసమే ఈ సినిమా ఒప్పుకుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మెగాస్టార్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, డైలాగ్స్ తో కొరటాల శివ.. ఆచార్య చిత్రాన్ని వడ్డించబోతున్నారు. సినిమా మొత్తం దేవాలయాలు, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు ఉంది. దీంతో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…