Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 29న చిత్రం విడుదల కానుండగా.. ఈ సినిమాకి వీలైనంత ప్రచారం దక్కేలా చేస్తున్నారు. అంతేకాక మీడియా ఇంటరాక్షన్ లో అనేక విషయాల గురించి చెప్పుకొస్తున్నారు. తాజాగా ఓ పాత్రికేయుడు.. చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ఆచార్యకి టికెట్ రేటు పెంచవలసిన అవసరం ఉందా ? అని అడిగారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది.
వడ్డీగా రూ.50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా ? ఎవరిస్తారు చెప్పండి ?. మేము ప్రభుత్వాలకు 42 శాతం పన్ను కడుతున్నాం.. అని అన్నారు. ఈ క్రమంలో టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలను వేడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు అని చిరంజీవి అన్నారు.
కాగా ఈ నెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు సైతం వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. ఇక ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించడమనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. నటుడిగా రామ్‌చరణ్ కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయే స్థితిని చూడడం తండ్రిగా గొప్ప అనుభూతి. రామ్‌చరణ్ తన కెరీర్‌ను మలుచుకొనే తీరు అద్బుతంగా ఉంది.. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…