Telangana : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే కొందరు నేతలు కొత్త పార్టీలు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే తెరాసకు వ్యతిరేకత ఉన్నప్పటికీ మరీ భారీ స్థాయిలో లేదు. అయినప్పటికీ నేతలు కొత్త పార్టీలు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
మాజీ కేంద్ర మంత్రి, సిక్కిం, కేరళ మాజీ గవర్నర్ పి.శివ శంకర్ కుమారుడు డాక్టర్ పుంజల వినయ్ కుమార్ తెలంగాణలో డిసెంబర్‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాజాగా బంజారాహిల్స్‌లో తన అభిమానులు, మద్దతుదారులతో ఆయన ఓ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ ఏర్పాటు అవకాశాలపై ఆయన వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అందరికీ న్యాయం అందాలి.. అనే డిమాండ్‌తో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు విద్య అందేందుకు పోరాటం చేస్తుందన్నారు. ఓటర్లు విద్యావంతులు అయితే సరైన వ్యక్తులను ఎన్నుకుంటారు. కానీ అధికార పార్టీలు విద్యపై ఇందుకే ఖర్చు చేయడం లేదు.. అని ఆయన ఆరోపించారు.
కాగా శివ శంకర్ చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్లో పనిచేశాయి. అయితే వినయ్ కుమార్ మాత్రం రాజకీయాలకు చాలాకాలంగా దూరంగా ఉన్నారు. ప్రజారాజ్యంలో ఆయన తండ్రి చేరాక.. ఆయన కూడా ఆ పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. వినయ్ కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తన స్నేహితుడు డాక్టర్ పి.మిత్ర మద్దతుతో తాను రాజకీయాల్లోకి వచ్చానని వినయ్ కుమార్ తెలిపారు. రాజకీయ నాయకులు అభ్యర్థులను చూపించి కాకుండా.. తమ పార్టీల గుర్తులను చూపించి ప్రజలను ఓట్లు వేసే స్థితికి తెచ్చారని, ఇప్పుడు అసలు ఏ అభ్యర్థి ఏ గుర్తు నుంచి పోటీ చేస్తున్నారో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొందన్నారు.
కాగా 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు డాక్టర్ మిత్ర కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వినయ్ కుమార్ కొత్త పార్టీ వెనుక కూడా డాక్టర్ మిత్ర ఉన్నట్లు సమాచారం. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్య మనవడిగా మిత్ర అప్పట్లో పీఆర్‌పీలో చేరాక కొన్ని నెలలకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అల్లు అరవింద్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా మిత్ర.. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొద్ది నెలలకే బయటకు వచ్చారు. మరి కొత్తగా ఏర్పడబోయే పార్టీ తెలంగాణ రాజకీయాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…