7 Days 6 Nights Movie : నిర్మాత ఎంఎస్ రాజు పేరు చెబితే చాలు మనకు హిట్ చిత్రాలైన.. శత్రువు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి మూవీలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ నిర్మాతల్లో ఈయన టాప్ ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు పొందారు. అయితే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న చందంగా.. ఎంఎస్ రాజు పరిస్థితి కూడా మారింది. ఆయన ఏ సినిమా తీసినా ఫ్లాప్ అయింది. దీంతో ఆయన మరోబాట పట్టారు. అడల్ట్ కంటెంట్‌నే నమ్ముకున్నారు.
గతంలో ఆయన వాన, తూనీగ తూనీగ వంటి చిత్రాలను తీయగా.. అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన తన కంటెంట్‌ను మార్చారు. అడల్ట్ కంటెంట్‌కు ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలోనే డర్టీ హరి పేరిట ఓ సినిమాను తీసి వదిలారు. అది మంచి టాక్ సాధించింది. ఈ మూవీకి ఆయన ఏకంగా దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. దీంతో అదే బాటలో ఇంకో అడల్ట్ మూవీని మళ్లీ తెరకెక్కిస్తున్నారు.
ఎంఎస్ రాజు తాజాగా 7 డేస్ 6 నైట్స్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అందులో ఘాటు సీన్లతో అరాచకం సృష్టించారు. అందాల ఆరబోతలో హీరోయిన్స్ ఇద్దరూ ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ ప్రస్తుతం యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ మూవీలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతిక శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక ట్రైలర్‌ను చూస్తే చాలు.. సినిమా పూర్తిగా రొమాన్స్‌తో నిండిపోయి ఉందని అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకనే ఎంఎస్ రాజు మళ్లీ దాదాపుగా డర్టీ హరి లాంటి కథాంశంతో ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ మూవీని సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు. కానీ కుదరలేదు. ఇక దీని కథ విషయానికి వస్తే.. గోవా ట్రిప్‌కు వెళ్లిన ఇద్దరు అబ్బాయిలు అక్కడి అమ్మాయిలతో చేసిన రొమాన్స్, ఇతర అంశాలు.. ఉంటాయి. ఏదో ఒక ఊహించని సంఘటన జరుగుతుందని మాత్రం ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. కాగా ఈ మూవీని అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. ఓటీటీలో లేదా థియేటర్లలో.. ఎందో ఈ మూవీ విడుదల కానుందో త్వరలో ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…