5G Phones List : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఈమధ్యే 5జి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో మొత్తం 8 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జి సేవలను మొదలు పెట్టింది. ఆ నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఇక 5జి అందుబాటులో ఉన్న ఫోన్లు ఇప్పటికే మార్కెట్‌లో చాలా లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే తమ 5జి సేవలు లభిస్తున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఎయిర్‌టెల్ విడుదల చేసింది. ఈ లిస్ట్ చూసి మీ ఫోన్ 5జి ని సపోర్ట్ చేస్తుందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక ఆ లిస్ట్ విషయానికి వస్తే..
యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 ఆ తరువాత వచ్చిన ఐఫోన్లు అన్నింటిలోనూ 5జి అందుబాటులో ఉంది. కనుక ఈ ఫోన్లు ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇక శాంసంగ్‌లో గెలాక్సీ ఎ53, ఎ33, ఎస్21 ఎఫ్ఈ, ఎస్22, 22ప్లస్, 22 అల్ట్రా, ఎం33, జడ్ ఫ్లిప్ 4, జడ్ ఫోల్డ్ 4, నోట్ 20 అల్ట్రా ఫోన్లలో 5జి ఉంది. అలాగే ఎస్21, ఎస్21 ప్లస్, ఎస్21 అల్ట్రా, జడ్ ఫోల్డ్ 2, ఎఫ్42, ఎ52ఎస్, ఎం52, జడ్ ఫ్లిప్ 3, జడ్ ఫోల్డ్ 3, ఎ22, ఎస్20 ఎఫ్ఈ, ఎం32, ఎఫ్23, ఎ73, ఎం42, ఎం53, ఎం13 ఫోన్లలోనూ 5జి లభిస్తుంది.
షియోమీ, రెడ్‌మీ, పోకోలకు చెందిన ఎంఐ10, 10ఐ, 10టి, 10టి ప్రొ, ఎంఐ11 అల్ట్రా, ఎంఐ 11ఎక్స్ ప్రొ, ఎంఐ11ఎక్స్, పోకో ఎం3 ప్రొ, పోకో ఎఫ్3, ఎంఐ11 లైట్ ఎన్ఈ, రెడ్‌మీ నోట్ 11టి, షియోమీ 11టి ప్రొ, షియోమీ కె16, షియోమీ 11ఐ హైపర్ చార్జ్, రెడ్‌మీ నోట్ 10టి, నోట్ 11 ప్రొ ప్లస్, పోకో ఎం4, ఎం4 ప్రొ, షియోమీ 12 ప్రొ, ఎంఐ11ఐ, రెడ్‌మీ 11 ప్రైమ్, పోకో ఎఫ్4, పోకో ఎక్స్4 ప్రొ, రెడ్‌మీ కె50ఐ ఫోన్లలోనూ 5జిని పొందవచ్చు. అలాగే రియల్‌మికి చెందిన 8ఎస్, ఎక్స్7 మ్యాక్స్, నార్జో 30 ప్రొ, ఎక్స్7, ఎక్స్7 ప్రొ, 8, ఎక్స్50 ప్రొ, రియల్‌మి జిటి, జిటి మాస్టర్ ఎడిషన్, జిటి నియో2, రియల్‌మి 9, 9 ప్రొ, 9 ప్రొ ప్లస్, నార్జో 30, రియల్‌మి 9 స్పీడ్ ఎడిషన్, రియల్‌మి జిటి2, జిటి2 ప్రొ, జిటి నియో 3, నార్జో 50, నార్జో 50 ప్రొ.. ఫోన్లలోనూ 5జి వస్తుంది.
అలాగే వన్‌ప్లస్‌లో నార్డ్, 9, 9 ప్రొ, నార్డ్ సీఈ, సీఈ2, వన్‌ప్లస్ 10 ప్రొ, నార్డ్ సీఈ2 లైట్, 10ఆర్, నార్డ్ 2టి, 10టి, వన్‌ప్లస్ 8, 8టి, 8 ప్రొ, 9 ఆర్టీ, నార్డ్ 2, 9ఆర్ ఫోన్లలో కూడా 5జి లభిస్తుంది. ఒప్పోలో రెనో ప్రొ, రెనో 6, 6 ప్రొ, ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో ఎ53ఎస్, ఎ74, రెనో 7 ప్రొ, ఎఫ్21 ప్రొ, రెనో 7, రెనో 8, రెనో 8 ప్రొ, కె10, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొలలో, ఒప్పో ఫైండ్ ఎక్స్2లో కూడా 5జి వస్తుంది. వివో, ఐక్యూలలో ఐక్యూ 3, వివో ఎక్స్50 ప్రొ, వి20 ప్రొ, ఎక్స్60 ప్రొ ప్లస్, ఎక్స్60, ఎక్స్60 ప్రొ, ఐక్యూ7, 7 లెజెండ్, వి21, ఐక్యూ జడ్3, వి21ఇ, ఎక్స్70 ప్రొ, ప్రొ ప్లస్, ఐక్యూ జడ్5, వివో వై72, వి23, వి23 ప్రొ, వి23ఇ, టి1, వై75, ఐక్యూ 9 ప్రొ, ఐక్యూ 9, ఐక్యూ 9ఎస్ఈ, వివో టి1 ప్రొ, ఐక్యూ జడ్6, ఎక్స్80, ఎక్స్80 ప్రొ, ఐక్యూ 9టి, వి25, వి25 ప్రొ, వై55, వివో వై55ఎస్.. ఫోన్లనూ ఎయిర్‌టెల్ 5జి సేవలను వినియోగదారులు పొందవచ్చు.
అయితే ఈ ఫోన్లలో కొన్ని ఫోన్లు 5జి రెడీ కాగా.. వాటిని ఇప్పటికప్పుడే 5జి కోసం వినియోగించుకోవచ్చు. కానీ కొన్ని ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ద్వారా 5జి సేవలు లభ్యం కానున్నాయి. ఇక ఆయా కంపెనీలను బట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎప్పుడు వచ్చేది తెలుస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…