Minister Nara Lokesh : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నారా లోకేష్ మాజీ సీఎం జగన్‌ని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.చంద్రబాబు ఇంటిని రక్షించుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తారు అని జగన్ ఆరోపించడంతో పాటు వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అని జగన్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన జగన్, బెంగుళూరు ప్యాలస్‌లో రిలాక్స్ అవుతున్నారని మండిపడ్డారు. 74 ఏళ్ల వయస్సులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చెయ్యడానికి మనస్సు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర లేకపోగా, ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందేనని విమర్శించారు. నాడు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు 464 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభిస్తే వైఎస్సార్సీపీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారని దుయ్యబట్టారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు. ఆధునీకరణ, మరమ్మతుల పనులు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్.ఆధునీకరణ, మరమ్మతు పనులు ఆపేశారు. సుమారుగా రూ. 500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసీపీ నాయకులు కబ్జా చేశారని లోకేశ్ ఆరోపించారు.
విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారని మండిపడ్డారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు అని లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు . అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం అని తమ పాలనలో ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశారు లోకేష్.విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వరద సహాయ చర్యలపై మంత్రి నారాయణ, కలెక్టర్ సృజనతో నారా లోకేశ్ సమీక్షించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…