Black Pepper : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను తమ వంట ఇంటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. మిరియాలలో రెండు రకాలు ఉంటాయి. నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు అని ఉంటాయి. మనం నల్ల మిరియాలను సాధారణంగా తరచూ ఉపయోగిస్తాం. అయితే ఆయుర్వేద ప్రకారం మిరియాలలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. మిరియాలను మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. మనం రోజూ తినే ఆహారాలపై మిరియాల పొడి కాస్త చల్లి తినవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల పొడిని పసుపుతో కలిపి తీసుకోవడం వల్ల విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అలాగే మిరియాల పొడిని రోజూ తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఇది కీళ్ల నొప్పులు, ఉన్నవారికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు మిరియాలను తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ సమస్య నుంచి బయట పడతారు.
మిరియాల పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీకు అసలు గ్యాస్ సమస్య రానే రాదు. మీరు తినే ఆహారాలు కూడా సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే పొట్ట ఉబ్బరం సమస్య ఉండదు. మలబద్దకం నుంచి బయట పడతారు. పొట్ట, పేగుల్లో ఉండే పురుగులు చనిపోతాయి. మిరియాల పొడిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. మీకు దగ్గు, జలుబు రావు. జ్వరం వస్తే వెంటనే తగ్గుతుంది. ఇలా మిరియాలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఏదో ఒక విధంగా తీసుకుంటే మనకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…